![]() |
![]() |
బుల్లితెర మీద కనిపించే వాళ్ళ పెళ్లిళ్లు త్వరత్వరగా ఐపోతున్నాయి. అది కూడా ఇంత హాట్ సమ్మర్లో. ఎవరినీ పిలవకుండా ముందస్తుగా సోషల్ మీడియాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఫ్యాన్స్‌కి చెప్పకుండా చకచకా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్‌గా ప్రియాంక సింగ్ పెళ్లి జరిగిపోయింది. నెటిజన్స్ ఐతే హ్యాపీ మారీడ్ లైఫ్ అబ్బాయి బాగున్నాడు. పెళ్లి కూతురు లుక్లో చాలా అందంగా ఉన్నావు అక్కా అంటూ కామెంట్స్ చేశారు.
ఇక ఇప్పుడు కార్తీక దీపం లేడీ విలన్‌గా పేరు తెచ్చుకున్న శోభా శెట్టి యశ్వంత్‌తొ కలిసి పెళ్లి పీటలెక్కింది. ఇక నెటిజన్స్ కూడా నైస్ కపుల్స్, ఏంటి యశ్వంత్ ఎవరినీ పిలవకుండా పెళ్లి చేసుకున్నావ్ ...యశ్వంత్ నువ్వు లక్కీ అంటూ కామెంట్స్ పెడుతూనే మరో వైపు "రియల్ పెళ్లి ఎప్పుడు, ఏది యాడ్ పెళ్ళో ఏది నిజం పెళ్ళో తెలీడం లేదు. నిజంగానే పెళ్లి నా ప్రమోషన్ వీడియో నా అర్ధం కాలేదు..అక్క బావ సూపర్" అంటూ కామెంట్స్ చేశారు. కానీ శోబాశెట్టి పెళ్లి కోసం ఆమె ఫాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ 7 కి వెళ్లి టాస్కులన్నీ బాగా ఆడింది శోభా. అలాగే కన్నడ బిగ్ బాస్కి కూడా వెళ్ళింది. ఇక యశ్వంత్ తో 2024 ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఇంకా పెళ్లిని పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు ఏ పెళ్ళైనా కానీ ఇలా పెళ్లి బట్టల్లో కనిపిస్తూ ఫాన్స్ని ఆనదాపరించింది.
![]() |
![]() |